ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ : గవర్నర్ శివ్‌ప్రతాప్ 2 d ago
TG: తెలంగాణ పురోగతిలో ప్రతిపౌరుడు భాగస్వామి అయ్యారన్నారు రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పాలన సాగుతోందన్నారు. 2047 నాటికి తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.